Last Updated:

IT raids on BBC: బీబీసీ కార్యాలయంపై ఐటీ అధికారుల సర్వే

IT raids on BBC: దిల్లీలోని ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయంపై ఐటీ అధికారులు సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయిలోని సంస్థ కార్యాలయాల్లో సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఈ మేరకు పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులోని సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దాడులకు కారణం అదేనా..

భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ దేశంలో పెద్ద వివాదం రాజేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ సమయంలో.. దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సర్వే నిర్వహించారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. ఆ డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా ఖండించింది. కావాలనే విద్వేషపూరితంగా రూపొందించారని ఆరోపించింది. ఈ డాక్యుమెంటరీపై పలు దేశాలు.. దూరం పాటించాయి.

సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు (IT raids on BBC)

మంగళవారం.. బీబీసీ కార్యాలయానికి ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం వెళ్లింది. సర్వే నిర్వహించే క్రమంలో అక్కడి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకొని.. వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. 60 నుంచి 70 మంది సభ్యుల బృందం సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని.. బీబీసీ కార్యాలయంలోకి ఇతరులు రావడాన్ని నిషేధించినట్లు ప్రచారం సాగుతోంది. బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇండియాతో పాటు బ్రిటన్‌లో కూడా వివాదాస్పదమైంది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. ఇదిలా ఉంటే బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని తిరస్కరించింది. మరో వైపు బీబీసీ పై ఐటీ దాడులు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. డాక్యుమెంటరీ నేపథ్యంలోనే ఐటీ దాడులకు కేంద్రం పాల్పడుతుందని ఆరోపించింది.