Last Updated:

PM Modi-Ram Temple: రామమందిరంపై పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అయోధ్యలోని శ్రీరామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంపులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడికి అంకితం చేసిన స్టాంపుల పుస్తకాన్ని విడుదల చేశారు. రామ మందిరం.గణేషుడు,హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్ , శబరి లతో కూడిన ఆరు స్టాంపులను విడుదల చేసారు.

PM Modi-Ram Temple: రామమందిరంపై  పోస్టల్  స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోదీ

PM Modi-Ram Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అయోధ్యలోని శ్రీరామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంపులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడికి అంకితం చేసిన స్టాంపుల పుస్తకాన్ని విడుదల చేశారు. రామ మందిరం.గణేషుడు,హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్ , శబరి లతో కూడిన ఆరు స్టాంపులను విడుదల చేసారు. సూర్యుడు, సరయూ నది, ఆలయం మరియు చుట్టుపక్కల శిల్పాలు ఉండేలా ఈ స్టాంపులను డిజైన్ చేసారు.

రామాయణం విశ్వవ్యాప్తం..(PM Modi-Ram Temple)

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఈరోజు, రామమందిరానికి అంకితం చేయబడిన ఆరు తపాలా స్టాంపులను విడుదల చేశాము. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా రాముడిపైస్టాంపుల పుస్తకం కూడా విడుదలయిందని అన్నారు.రాముడు, సీతాదేవి మరియు రామాయణ కథలు మతం లేదా కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో అనుసంధానించబడి ఉన్నాయి. రామాయణం ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రేమ విజయం గురించి బోధిస్తుంది. ఇది మొత్తం మానవాళిని తనతో కలుపుతుంది, అందుకే ఇది ప్రపంచం మొత్తం మీద ఆకర్షణగా మారిందని మోదీ పేర్కొన్నారు. 48 పేజీల స్టాంపుల పుస్తకం యూఎస్ ,న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలతో సహా 20 కంటే ఎక్కువ దేశాలు జారీ చేసిన స్టాంపులను కలిగి ఉంది.