Jammu and Kashmir Encounter: జమ్ము కశ్మీర్ రాజౌరి జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికుల మృతి
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.
Jammu and Kashmir Encounter :జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.
నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు..(Jammu and Kashmir Encounter)
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర మూకలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై డాక్టర్, పోలీస్ సహా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిటల్ శ్రీనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడిసిన్) డాక్టర్ నిసారుల్ హసన్, కానిస్టేబుల్ (జమ్ము కశ్మీర్ పోలీస్) అబ్దుల్ మాజీద్ భట్, లేబరేటరీ బేరర్ అబ్ధుల్ సలాం రాదర్, టీచర్ ఫరూక్ అహ్మద్ మిర్‌లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.ఫరూక్ అహ్మద్ మిర్‌ను తొలుత 1994లో విద్యాశాఖలో నియమించగా ఆపై 2007లో టీచర్‌గా పదోన్నతి పొందారు. ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయడం, ఉక్కుపాదం మోపడమే తమ విధానమని, జమ్ము కశ్మీర్‌ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మలిచేందుకు ఎల్‌జీ యంత్రాంగం కట్టుబడి ఉందని ప్రభుత్వం పేర్కొంది.