Published On:

Fibernet Scam: ఫైబర్‌నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టు అనుమతి

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. మొత్తం 114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి లభించింది. టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు గతంలో సీఐడీ పిటిషన్ వేసింది. సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు ఇస్తూ ఆస్తుల అటాచ్ కు అనుమతిచ్చింది. ఈ కేసులో నిందితులంతా చంద్రబాబు సహచరులని సీఐడీ చెబుతోంది.

Fibernet Scam: ఫైబర్‌నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టు అనుమతి

 Fibernet Scam: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. మొత్తం 114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి లభించింది. టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు గతంలో సీఐడీ పిటిషన్ వేసింది. సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు ఇస్తూ ఆస్తుల అటాచ్ కు అనుమతిచ్చింది. ఈ కేసులో నిందితులంతా చంద్రబాబు సహచరులని సీఐడీ చెబుతోంది.

నిబంధనలకు విరుద్దంగా..( Fibernet Scam)

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్రభుత్వం చేపట్టిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని మరియు రాష్ట్ర ఖజానాకు రూ.114 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు రూ.330 కోట్ల విలువైన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ఫేజ్-1 అప్పగించేందుకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్ ప్రక్రియను అవకతవకలు చేసిందని సీఐడీ పేర్కొంది.ఈ ప్రాజెక్ట్ నామమాత్రపు ధరతో ఒకే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ నుండి హై-స్పీడ్ ఇంటర్నెట్, టెలివిజన్ మరియు టెలిఫోనిక్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ [INCAP] ద్వారా బ్లాక్‌లిస్ట్ చేయబడిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు అందించబడిందని సీఐడీ తెలిపింది.

స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం కేసు..

స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని దర్యాప్తు బృందం సవాల్ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొంది. ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని హైకోర్టు నిర్ధారిస్తూ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఐడీ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంపై సీఐడీ అభ్యంతరం తెలిపింది. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని ఏఏజీ పొన్నవోలు అన్నారు. న్యాయపరంగా తమకున్న హక్కులన్నీ ఉపయోగించుకుంటామని చెప్పారు.

మద్యం కేసులో విచారణ వాయిదా..

మరోవైపు మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగమూర్తి వర్చువల్ లో వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీలో అప్పట్లో కొంతమంది లిక్కర్ షాప్, బార్ ఓనర్లు ఇచ్చిన ప్రివిలేజస్ ను కేబినెట్ ఆమోదించిందని కోర్టుకు తెలిపారు. తర్వాత అసెంబ్లీలో కూడా ఆమోదం పొందిందన్నారు. షాప్ అనుమతులు, లైసెన్స్ ల విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని వాదనలు వినిపించారు. సీఐడీ చేసిన అభియోగాలపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని.. రాజకీయ కక్షతో ఈ కేసును నమోదు చేశారన్నారు.

ఇలాఉండగా చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకి సిఐడి సమయం కోరడంతో హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.