Home / Delhi liquor scam
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంజయ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితులపై ఈడీ సోదాలు చేసింది.
తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణ కీలకంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్‌గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి కోర్టు అనుమతి కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను అంగీకరించింది స్పెషల్ కోర్టు. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి బెయిల్‌పై ఉన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మే 24న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో తాజా సోదాలు, దాడులు నిర్వహించింది.
Manish Sisodia: దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడవ చార్జిషీటులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఈసారి ఈడీ మరికొన్ని కీలక అంశాలని బయటపెట్టింది. 2023 మార్చి 28న కవిత పిఎ బుచ్చిబాబు ఇచ్చిన వివరాలని చార్జిషీట్‌లో ఈడీ పొందు పరిచింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టుల మీద చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది వరకే ఈ నెల 11న కవిత తొలి విచారణకు హాజరైన సందర్భంలో కూడా ఇలాంటి వాతావరణం లేదు.
ఒక మహిళను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.