Home / Manish Sisodia
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన 11 గంటలకు వివరణ ఇచ్చేందుకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది,
ఢిల్లీ లిక్కర్ స్కాం ఒక్కో రోజు ఒక్కో విధంగా ప్రకంపనలు గుప్పిస్తుంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నేడు సీబీఐ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది.
దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు గుప్పించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసులో ప్రధాన నిందితుడుగా సీబీఐ నమోదు చేసిన వారిలో ఒకరైన ఢిల్లీ ఆప్ పార్టీ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. సభలో 59 మంది సభ్యలు అయనకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సీబీఐ మనీష్ సిసోడియాపై ఫేక్ లిక్కర్ కేసు నమోదు చేసి దాడులు చేసినప్పటి నుంచి గుజరాత్‌లో ఆప్‌కు నాలుగు శాతం వోట్ షేరు పెరిగిందని, ఒక వేళ ఆయనను అరెస్టు
సీబీఐ ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాకర్‌ను తనిఖీ చేసింది. ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ నేపధ్యంలో తన బ్యాంక్ లాకర్‌పై సెంట్రల్ ఏజెన్సీ దాడులు చేస్తుందని సిసోడియా సోమవారమే పేర్కొన్నారు.
తాను బీజేపీలో చేరితే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఎత్తేస్తామని బీజేపీ నుంచి తనకు సందేశం వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. అయితే బీజేపీలో చేరడం కంటే తన తల నరుక్కుంటానని ఆయన అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో 21 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.