Last Updated:

Assam Rifles: మణిపూర్ పోలీసు కమాండోలను రక్షించిన అస్సాం రైఫిల్స్ బృందం

భారతదేశం-మయన్మార్ సరిహద్దు పట్టణం మోరే వద్ద హైవే వెంబడి తిరుగుబాటుదారుల ఆకస్మిక దాడిలో చిక్కుకున్న మణిపూర్ పోలీసు కమాండోలను రక్షించడంలో అస్సాం రైఫిల్స్ దళాలు అసాధారణమైన ధైర్యాన్ని మరియు సమన్వయాన్ని ప్రదర్శించాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Assam Rifles: మణిపూర్ పోలీసు కమాండోలను రక్షించిన అస్సాం రైఫిల్స్ బృందం

Assam Rifles: భారతదేశం-మయన్మార్ సరిహద్దు పట్టణం మోరే వద్ద హైవే వెంబడి తిరుగుబాటుదారుల ఆకస్మిక దాడిలో చిక్కుకున్న మణిపూర్ పోలీసు కమాండోలను రక్షించడంలో అస్సాం రైఫిల్స్ దళాలు అసాధారణమైన ధైర్యాన్ని మరియు సమన్వయాన్ని ప్రదర్శించాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

వేగంగా తరలించిన అస్సాం రైఫిల్స్ వాహనం..(Assam Rifles)

మోరే పట్టణంలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు అధికారి చింగ్తం ఆనంద్‌ను చొరబాటుదారులు కాల్చివేశారు. ఈ ఘటన నేపథ్యంలో అక్టోబరు 31న మణిపుర్‌ పోలీస్‌ కమాండోల కాన్వాయ్‌ మోరేకు వెళ్తుండగా.. చొరబాటుదారులు వారిపై మెరుపుదాడికి పాల్పడ్డారు. వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనితో కమాండోలు వారిని ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. ఈ సందర్బంగా ముగ్గురు కమాండోలు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వచ్చిన రైఫిల్స్ బృందం వారిని సమీపించి బుల్లెట్ల వర్షం కురుస్తున్నా తమ వాహనాల్లో ఎక్కించుకుని వేగంగా వెళ్లిపోయింది. అస్సాం రైఫిల్స్ వైద్యుడు గాయపడ్డ కమాండోలకు తక్షణ వైద్య సహాయాన్ని అందించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇలాఉండగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బంగ్లాదేశ్, మయన్మార్ మరియు మణిపూర్ నుండి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన అనుమానాస్పద అంతర్జాతీయ కుట్రపై దర్యాప్తు చేస్తోంది. ఈ సమూహాలు జాతి హింసను ఉపయోగించుకుంటాయి మణిపూర్‌లో కుకి తెగలు మరియు మెయిటీల మధ్య జరిగిన జాతి హింస నేపథ్యంలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరియు వేలాది మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో చేర్చాలనే డిమాండ్లు మరియు అక్రమ వలసలపై ఆందోళనలతో కొనసాగుతున్న వివాదం రాష్ట్రంలో అస్థిర వాతావరణాన్ని సృష్టించింది.