Amul Milk: మళ్లీ పెరిగిన అమూల్ పాల ధర.. లీటర్ పాల ధర ఎంత పెరిగిందంటే..
అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. అన్ని వేరియంట్ల పై రూ. 3 పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది.

Amul Milk: అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. అన్ని వేరియంట్ల పై రూ. 3 పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్
(జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది.
గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్ ఎండీ ఆర్‌ఎస్ సోథి తెలిపారు.
పెరిగిన తాజా అమూల్ ధరలు శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయి.
అమూల్ తాజా ధరలు (Amul Milk)
అమూల్ గోల్డ్ ధర గోల్డ్ రూ. 66, అమూల్ తాజా రూ. 54, అమూల్ ఆవు పాలు రూ. 56, అమూల్ ఎ2 గేదె పాలు రూ. 70 లుగా ఉంటుందని అమూల్ ప్రకటించింది.
పాల ఉత్పత్తి , నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణం వల్లే ధరలు పెంచాల్సి వస్తోందని అమూ జీసీఎమ్ఎమ్ఎఫ్ తెలిపింది.
గత ఏడాదితో పోస్తే ఒక్క పశువుల దాణా ఖర్చు 20 శాతం వరకు పెరిగినట్టు పేర్కొంది.
అయితే చివరిసారిగా గత ఏడాది అక్టోబర్‌లో అమూల్ గోల్డ్, తాజా, శక్తి పాల బ్రాండ్‌ల ధరలను లీటరుకు రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరిగి మూడు నెలలోనే మళ్లీ రూ. 3 పెంచింది.
గత 10 నెలల్లో అమూల్ పాల ధరలు రూ. 12 పెరిగాయి. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున పాల కంపెనీలు రైతులకు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తోంది.
దీంతో రానున్న రోజుల్లో పాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకలు చెబుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/