Amul Mother Dairy Milk Prices Hike: రేపటి నుంచి పెరగనున్న అమూల్, మదర్ డెయిరీ పాలధరలు
ఇప్పటికే పలు నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలను డెయిరీ కంపెనీలు కూడ బాదడం ప్రారంభించాయి. డెయిరీ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న అమూల్ మంగళవారం ప్యాక్డ్ మిల్క్‌పై లీటరు ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది.
Amul Mother Dairy Milk Prices Hike: ఇప్పటికే పలు నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలను డెయిరీ కంపెనీలు కూడ బాదడం ప్రారంభించాయి. డెయిరీ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న అమూల్ మంగళవారం ప్యాక్డ్ మిల్క్‌పై లీటరు ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 17 నుండి ధరల పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది. శక్తి, గోల్డ్ మరియు తాజా బ్రాండ్ పేర్లతో పాలను విక్రయించే అమూల్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ మరియు ముంబై మార్కెట్లలో ధరల పెంపును అమలు చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 17 నుండి, 500 ఎంఎల్ అమూల్ గోల్డ్ ధర వరుసగా రూ. 31, అముల్ తాజా రూ. 25 మరియు అమూల్ శక్తి- రూ. 28గా ఉంటాయని పేర్కొంది.
మరోవైపు మదర్ డెయిరీ కూడా సర్క్యులర్ జారీ చేసింది. మదర్ డెయిరీ వినియోగదారులకు, ఈ ఏడాది ధర పెంపు ఇది రెండోసారి. అంతకుముందు మార్చిలో, మదర్ డెయిరీ తన పాలీ-ప్యాక్ పాల ఉత్పత్తుల ధరలను పెంచింది. ఆగష్టు 17 నుంచి ఫుల్ క్రీమ్ మదర్ డైరీ పాలీ-ప్యాక్ ధర రూ.59కి బదులుగా రూ.61 అవుతుంది. అదే విధంగా ఆవు పాలు లీటరు రూ.53 టోన్డ్ మిల్క్ ధర రూ.51, డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.45 ఉంటుందని మదర్ డెయిరీ సర్క్యులర్ పేర్కొంది.
గత ఐదు నెలల్లో పాల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా పెరిగిందని డెయిరీ అధికారులు తెలిపారు. ముడి పాల ధరలు సుమారు 10 నుండి 11 శాతం పెరిగడం, పశుగ్రాసం రేట్లలో నిరంతర పెరుగుదల, జీఎస్టీతో రేట్లను పెంచడం తప్పలేదని అన్నారు.