Last Updated:

Indias GDP: దుమ్ము రేపిన జీడీపీ…క్యూ4లో 7.8 శాతం నమోదు..

మార్కెట్‌ ఎనలిస్టుల అంచనాలను తారుమారు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నాలుగ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ఏకంగా 7.8 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికిచూస్తే జీడీపీ 8.2 శాతం నమోద్యే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది.

Indias GDP: దుమ్ము రేపిన జీడీపీ…క్యూ4లో 7.8 శాతం నమోదు..

 Indias GDP: మార్కెట్‌ ఎనలిస్టుల అంచనాలను తారుమారు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నాలుగ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ఏకంగా 7.8 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికిచూస్తే జీడీపీ 8.2 శాతం నమోద్యే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది. కాగా రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా క్యూ4లో జీడీపీ 6.9 శాతం అంచనా వేసింది. కాగా ఆర్బీఐ అంచనాలను కూడా మించిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌లో జరిగిన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాల్లో మార్పు చేయకుండా యధాతథంగా 7 శాతానికే పరిమితం చేసింది. త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.1 శాతం నమోదైంది. అంతకు ముందు 7.2 శాతంగా అంచనా వేశారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే జీడీపీ 6.9 శాతం లక్ష్యంగా పెట్టకుంది ఆర్‌బీఐ. అంతకు ముందు జరిగిన సమీక్షలో 6.8 శాతంగా అంచనా వేశారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వరుసగా 7 శాతంగా అంచనా వేసింది ఆర్‌బీఐ.

రికార్డు స్థాయిలో విదేశీ మారకద్రవ్యం..( Indias GDP)

ఇదిలా ఉండగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని చెప్పారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా ప్రపంచవ్యాప్తంగా అనుకున్న లక్ష్యానికి చేరుకోబోతుందన్నారు. అయితే అభివృద్ది చెందిన దేశాల్లో రుణాలు బాగా పెరిగిపోయాయని దాని ప్రభావం ఇండియాపై కూడా ఉంటుందన్నారు దాస్‌. కాగా మార్చి 29 నాటికి చూస్తే రిజర్వుబ్యాంకు వద్ద విదేశీ మారకద్రవ్యం రికార్డు స్థాయిలో 645.6 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇక ఏప్రిల్‌ నెలలో ఎనిమిది కీలక రంగాల్లో వృద్దిరేటు గత ఏడాది ఏప్రిల్‌లో పోల్చుకుంటే 6.2 శాతంగా నమోదైందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా కీలక రంగాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు విద్యుత్‌, సహజవాయువు, బొగ్గు, ఉక్కు, రిఫైనరీ ప్రాడక్టులు, ముడిచమురు, సిమెంట్‌ రంగాల్లో ఉత్పత్తి పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి: