Last Updated:

Paytm shares jump: వరుసగా రెండవరోజు 5 శాతం పెరిగిన పేటీఎం షేరు ధర

పేటియం వ్యస్థాపకుడు విజయశేఖర వర్మకు చెందిన షేర్లు గత కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. కరోనా సమయంలో ఐపీవోకు వచ్చిన పేటీయం మార్కెట్‌ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. ఒక్కోషేరు రూ.2,080లు విక్రయించింది.

Paytm shares jump: వరుసగా రెండవరోజు 5 శాతం పెరిగిన పేటీఎం షేరు ధర

Paytm shares jump: పేటియం వ్యస్థాపకుడు విజయశేఖర వర్మకు చెందిన షేర్లు గత కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. కరోనా సమయంలో ఐపీవోకు వచ్చిన పేటీయం మార్కెట్‌ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. ఒక్కోషేరు రూ.2,080లు విక్రయించింది. అటు తర్వాత మార్కెట్లో కోట్‌ అయిన వెంటనే దారుణంగా క్షీణించింది. అటు నుంచి షేరు పైకి ఎగిసిన దాఖలాల్లేవు. ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారు భారీగా నష్టపోయారని చెప్పవచ్చు. రిజర్వుబ్యాంకుతో పాటు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబి విధించిన కఠిన నిబంధనలతో షేరుకు కోలుకోలేని దెబ్బతగిలింది.

 మూడు ట్రేడింగ్ సెషన్లలో పుంజుకుంటున్న షేరు..(Paytm shares jump)

అయితే గత కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూసిన షేరు కాస్తా ఇటీవల కాలంలో కాస్తా ప్రాణం పోసుకుంది. వరుసగా గత మూడు ట్రేడింగ్‌ సెషన్‌లలలో క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో షేరు ధర 5 శాతం పెరిగింది. బ్లాక్‌ డీల్‌లో 75.20 లక్షల షేర్లు చేతులు మారాయి. మొత్తంలో కంపెనీ షేర్లలో ఇది 1.2 శాతంగా చప్పుకోవచ్చు. కాగా ఈ బ్లాక్‌డీల్‌లో ఒక్క షేరు రూ.391 చొప్పున మొత్తం డీల్‌ రూ.296.30 కోట్లకు చేరింది. అంతకు ముందు రోజు అంటే గురువారంతో పోల్చుకుంటే రూ.377.40తో పోల్చుకుంటే 3.6 శాత ప్రీమియం చెల్లించినట్లు అయింది.

మూడు రోజులుగా చేతులు మారుతున్న షేర్లు..

అయితే పేటియం షేర్లు నెలవారి షేర్లు 36 లక్షల కంటే ఎక్కువ చేతులు మారేవి కావు. అయితే గత మూడు రోజుల నుంచి కోటి షేర్ల వరకు చేతులు మారుతున్నాయి. దీనికంతటికి కారణం బిలియనీర్‌ గౌతమ్‌ అంబానీ పేటియంలో కొంత వాటానుకొనుగోలు చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడమే. అయితే పేటీయం ఈ వార్తలను తోసిపుచ్చింది. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని తేల్చేసింది. ఇప్పటి వరకు అదానీలతో ఎలాంటి చర్చలు జరగలేదు. అలాంటి పరిస్థిఇ ఉత్పన్నం అయితే నిబంధనల ప్రకారం సెబికి సమాచారం అందిస్తామని పేటీయం స్పష్టం చేసింది.

మీడియాలో వస్తున్న రిపోర్టులను అదానీ గ్రూపు కూడా ఖండించింది. ఇవన్నీ కేవలం ఊహాగానాలే అని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఇటు పేటీయం, అటు అదానీ గ్రూపు కూడా పేటీయంలో వాటాలు కొనుగోలు చేస్తారంటూ వచ్చిన వార్తలను ఖండించడంతో మరి సోమవారం నాటి ట్రేడింగ్‌లో దీని షేరు పెరుగుతుందా లేక తగ్గుతుందా వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి: