Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బలిఇచ్చిన మేకచేతిలోనే హతమయిన వ్యక్తి.. ఎలాగంటే..
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేక కన్ను బగర్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక ఆలయంలో మేకను బలి ఇచ్చిన తరువాత ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేక కన్ను బగర్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక ఆలయంలో మేకను బలి ఇచ్చిన తరువాత ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
బగర్ సాయి మదన్‌పూర్ గ్రామానికి చెందిన తోటి నివాసితులతో కలిసి ఆదివారం ఖోపా ధామ్‌కు బలి ఆచారాన్ని చేపట్టారు. గమ్యస్థానానికి చేరుకున్న గ్రామస్థులు మేకను బలి ఇస్తూ ముందుకు సాగారు.పవిత్ర ఆచారాలు పూర్తయిన తరువాత, సంఘం సభ్యులు మేక మాంసాన్ని సిద్ధం చేసి తినడానికి సమావేశమయ్యారు.
గొంతుకు అడ్డుపడటంతో ..( Chhattisgarh)
బగర్ సాయి వండిన మాంసం నుండి మేక కన్ను ఒకటి తీసి దానిని తినడానికి ప్రయత్నించాడు. అయితే మేక కన్ను అతని గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు. దీనితో వెంటనే అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అం టే ఏ మేకను అయితే బగర్ సాయి బలి ఇచ్చాడో అదే మేక కన్ను అతని ప్రాణాలు తీయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
- Hari Rama Jogaiah : అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని.. సీఎం జగన్ పై ఫైర్ అయిన హరిరామ జోగయ్య
- Road Accident : కరీంనగర్ జిల్లాలో విషాదం.. రోడు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి