Home / తప్పక చదవాలి
డెంగ్యూ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా పండ్ల రసాన్ని ఎక్కించిన ఆరోపణలతో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గ్లోబల్ హాస్పిటల్ కూల్చివేతకు నోటీసును అందజేసారు
సీనియర్ సెటిజన్లు, దివ్యాంగులకు తితితే శుభవార్తను అందించింది. నవంబర్ నెలలో వారి కోటాలోని శ్రీవారి దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకొనేందుకు వివరాలను తెలిపింది. అక్టోబర్ 26 మద్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
వలస పేరుతో భారతదేశానికి వచ్చి, మనలను బానిసలుగా చేసిన బ్రిటిష్ దేశానికి ఇప్పుడు భారత సంతతి వ్యక్తి , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ప్రధాని కావడం గర్వకారణం. సుమారు 200 ఏళ్లు మనల్ని పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు మనవాడు పరిపాలించనున్నాడు. అందులోనూ దీపావళి రోజే రిషి ఎన్నిక కావడం మరో విశేషం. ఈరోజు మనవాడు బ్రిటన్ ప్రధాని అవ్వడంతో ఇది కదా మనకు అసలైన దీపావళి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయనకు ఇండియాతో ఉన్న అనుబంధం ఏంటి? బ్రిటన్ కొత్త ప్రధాని పూర్వీకుల మూలాలు ఇండియాలో ఉన్నాయి. రుషి సునక్ జీవిత ప్రస్థానంపై ప్రైమ్9 స్పెషల్ స్టోరీ.
ఈ ఏడాదిలో ఏర్పడిన సూర్య గ్రహాణాలకంటే ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం చాలా శక్తి వంతమైనది.అలాగే ఈ ఏడాదిలో చివరి గ్రహం కాబట్టి ఈ గ్రహాణానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గ్రహణం అన్ని దేశాల్లో కాకుండా మన దేశంలో అక్టోబర్ 25 సాయంత్రం 4:22 గంటలకు ప్రారంభం కాబోతోంది.
మెకేఫే గుర్తించిన 16 యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని ఆర్స్ టెక్నికా రిపోర్ట్ వెల్లడించింది. ఇంతకు ముందు వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్ కోసం ఈ యాప్స్ మనకి అందుబాటులో ఉండేవి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు, టార్చ్ ఫ్లాష్‌లా వాడేందుకు, మెజర్మెంట్ యాప్స్‌గా ఈ అప్లికేషన్స్‌గా లిస్ట్ అయి ఉండేవి. తొలగించిన యాప్స్ ఇవే
ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు వందల రోజుల తరబడి పేదలకు అన్నదానం చేస్తున్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు వారు నడుంబిగిస్తే, మేము మీకు తోడంటూ దాతలు క్యూ కడుతున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటిన్ పధకాన్ని రద్దు చేసింది. దీంతో పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామా నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు నడుం బిగించారు.
రాజకీయాలు రాజకీయాలే. ప్రభుత్వం ప్రభుత్వమే. ఇది మరిస్తే ఎవరికైనా పరాభవం తప్పదు. వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నారని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ సీఎం కేసిఆర్ రాజ్యాంగ బద్ధ వ్యవస్ధలను అగౌరపరుస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు.
మహారాష్ట్ర శివసేన పార్టీలో ముసలం పెట్టిన భాజపా, అసమ్మతి వర్గానికి మద్దుతు ఇచ్చి ఏక్ నాధ్ షిండేకు అధికార పీఠం కట్టబెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ఓ సంచలన రాజకీయ కధనాన్ని ప్రచురించింది.
2023లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కర్ణాటక భాజపా అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతృత్వంలో రిజర్వేషన్ పెంపుపై తీసుకొన్న ప్రభుత్వం నిర్ణయంపై గవర్నర్ తేవర్ చంద్ గహ్లాట్ ఆమోద ముద్ర వేశారు.
ప్రముఖ అంతర్జాతీయ సంస్ధ ఫిలిప్స్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సంఖ్యలో 5శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఆ కంపెనీ సీఈఓ రాయ్ జాకోబ్స్ పేర్కొన్నారు. దీంతో 4వేల మందిని తొలగించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.