Home / తప్పక చదవాలి
వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు నేడు అనగా మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపింది.
క్రికెట్ లోకమంతా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వైపు చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోని గ్రూప్-2లో భాగంగా సెమీస్ కు ఏఏ జట్లు వెళ్తాయి, ఏఏ జట్లు ఇంటి దారి పడతాయనే ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను ఓ సారి పరిశీలించి ఏఏ జట్లు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయో చూద్దాం.
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజి) సిలిండర్ల దొంగతనాన్ని చేపట్టేవారికి కేంద్రం చెక్ పెట్టింది. ఇంటివద్దకే గ్యాస్ సిలిండర్లను అందుకొనే వినియోగదార్లు ఇకపై ఓటిపితో గ్యాస్ డెలివరీని తీసుకొనేలా చేసింది. ఇందుకోసం నేటి నుండి కొత్త డెలివరీ అధెంటికేషన్ కోడ్ (డిఏసి) విధానాన్ని తీసుకొచ్చింది.
ఎయిమ్స్‌లో ఓ అద్భుత ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఏడు నెలలుగా కోమాలోనే ఉన్న ఓ మహిళ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరే ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మరి అదేంటో చూసెయ్యండి.
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయిన ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు, మైక్రోబ్లాగింగ్ యాప్ లో తనదైన స్టైల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే ట్విట్టర్ కు పోటీగా మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించి పని పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త సామాజిక మాధ్యమ వేదికకు ‘బ్లూస్కై’గా నామకరణం చేసినట్టు సమాచారం.
నాగదోషము వలన దరిద్రము, గర్భస్రావములు, అంగవైకల్య సంతానము, చర్మ రోగములు, తీవ్రమైన కోపము, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యము కలుగుతుంది.
ప్రభుత్వరంగ సంస్ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.. 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.