Insult to Indian national flag: రెచ్చిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారుల…భారత జాతీయ జెండాకు ఘెర అవమానం..
కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. మన దేశ జాతీయ జెండాను ఘోరంగా అవమానించారు. దీంతో ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఉధ్రిక్తత వాతావరణం చోటుచేసుకొనింది.
Canada: కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. మన దేశ జాతీయ జెండాను ఘోరంగా అవమానించారు. దీంతో ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఉధ్రిక్తత వాతావరణం చోటుచేసుకొనింది.
వివరాలమేరకు, బందీ చోర్ దివాస్ సందర్భంగా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఖలిస్తానీ పతాకాన్ని పైకి ఎగురవేస్తూ ర్యాలీ నిర్వహించారు. సమీపంలో నివసించే భారతీయులకు తెలియడంతో వారు కూడా తమ వాహనాల్లో త్రివర్ణ పతాకాలను చేతబూని ర్యాలీ చేపట్టారు.
ఓ కారులో త్రివర్ణ పతాకంతో వెళ్తున్న వ్యక్తి చేతుల్లోంచి లాక్కొని కిందవేసి తొక్కి మరీ అవమానించారు. దీంతో తీవ్ర నిరసన చోటుచేసుకొనింది. ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూనే భారత్‌కు వ్యతిరేకంగా నినదించారు. వీరికి పోటీగా అక్కడికి చేరిన భారతీయులు హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఖలిస్తానీ మద్దతుదారుల చర్యపై కెనడాలో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ ఘటనపై అక్కడి భారతీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖలిస్తాన్ తీవ్రవాద సంస్ధను చాలా కాలం కిందట మన దేశం బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసింది. దీంతో ఖలిస్తాన్ మద్దతుదారులు భారతీయులను అవమనాలను చేయడమే ధ్యేయంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Russia-Ukraine war: వెంటనే ఉక్రెయిన్ వదిలి వెళ్లండి.. భారతీయులకు రాయబార కార్యాలయం సూచన