Home / తప్పక చదవాలి
హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నా అవసరం పార్టీకి లేదని భావించిన తర్వాత కూడా.తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీకి షాకిచ్చారు. 2023 డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన అంబటి రాయుడు పది రోజులు కూడా తిరగకముందే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు చెందిన పూర్వీకుల ఆస్తుల్లో రెండింటిని శుక్రవారం రూ.2.04 కోట్లకు వేలం వేశారు. స్మగ్లర్లు మరియు విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 ప్రకారం వేలం జరిగింది, ఇది స్మగ్లర్లు అక్రమంగా సంపాదించిన ఆస్తులు మరియు ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ ఆస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై తెలంగాణ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీ లను విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై చెప్పారు. జగన్‌ను నమ్మి పార్టీలోకి వచ్చానని.. నమ్మినందుకు గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సర్వే పేరుతో టికెట్ ఇవ్వమని అనడం సరికాదని మండిపడ్డారు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాననని.. తాను రాయదుర్గం నుంచి తన భార్య కల్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) గురువారం బ్లడ్ యూనిట్లపై సరఫరా మరియు ప్రాసెసింగ్ ఖర్చులు మినహా అన్ని ఛార్జీలను నిషేధించింది. డీజీసీఐ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక లేఖను పంపింది. రక్తం అమ్మకానికి లేదు అనే అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులు సమగ్ర భూరక్ష చట్టంపై పవన్ మద్దతు కోరారు. సమావేశంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ న్యాయవాదుల ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా మొహల్లా క్లినిక్స్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సీబీఐ విచారణ జరిపించాలని హోమంత్రిత్వశాఖకు విచారణకు సిఫారసు చేశారు. దీంతో హోమంత్రిత్వశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.డైరెక్టరేట్ ఆఫ్ ప్యామిలీ వెల్ఫేర్ మొహల్లా క్లినిక్స్ లో పెద్ద ఎత్తున అవకతకలు జరుగతున్నాయని ఓ నివేదికను ఎల్జీకి పంపించింది.
నెల్లూరు జిల్లా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొడవలూరు జాతీయ రహదారిపై లారీని ఎమ్మెల్సీ కారు ఢీకొట్టింది. ఈప్రమాదలో పిఏ వెంకటేశ్వర్లు అక్కడిక్కడే మృతి చెందగా డ్రైవర్,ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.