Kesineni Nani: త్వరలోనే ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా.. కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నా అవసరం పార్టీకి లేదని భావించిన తర్వాత కూడా.తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నా అవసరం పార్టీకి లేదని భావించిన తర్వాత కూడా.తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. అందుకే త్వరలోనే ఢిల్లీ వెళ్లి స్పీకర్ కు తన రాజీనామాను అందిస్తానని తెలిపారు. అనంతరం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించారు. తన ట్వీట్ కు చంద్రబాబు, నారా భువనేశ్వరిలతో కలసి నడుస్తున్న ఫొటోను ట్యాగ్ చేశారు.
నాని తమ్ముడికి అండగా..( Kesineni Nani)
నాని 2014, 2019లో వరుసగా రెండు ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు.అయితే గత కొంతకాలంగా నాని తమ్ముడు చిన్నిని టీడీపీ ప్రోత్సహిస్తూ అతనికి అండగా నిలుస్తోంది. విజయవాడ ఎంపీ స్థానానికి తదుపరి పోటీదారుగా చిన్నిని పార్టీ ప్రొజెక్టు చేస్తోంది.దీనితో అన్నదమ్ములిద్దరి మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. నాని కొద్దిరోజుల కిందట పార్టీ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తిరువూరు వెళ్లిన సమయంలో విబేధాలు బయటపడ్డాయి. నాని ,అతని తమ్ముడి గ్రూపు కు చెందిన కార్యకర్తలు విడిపోయి ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన నాని తాను మూడోసారి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని స్పష్టం చేసారు.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024