Home / తప్పక చదవాలి
ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై.. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల స్వీకరించడానికి.. ప్రతి పార్టీకి సమయం ఇస్తామని ఈసీ తెలిపింది.
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.
యునైటెడ్ స్టేట్స్ లో పదవీ విరమణ పొందిన ఒక జంట విన్ ఫాల్ లాటరీలో సుమారుగా రూ.200 కోట్లు సంపాదించారు. గణిత శాస్త్రంలో ప్రావీణ్యాన్ని ఉపయోగించి దాని ప్రకారం లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి వారు ఈ భారీ మొత్తాన్ని పొందగలిగారు.
మయన్మార్ లోని వాయువ్య ప్రాంతంలో ప్రజాస్వామ్య అనుకూల ప్రతిఘటన నియంత్రణలో ఉన్న ఒక గ్రామంపై పాలక మిలిటరీ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 17 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలోతొమ్మిది మంది పిల్లలతో సహా 20 మందికి పైగా గాయపడ్డారని స్థానిక నివాసితులు మరియు మానవ హక్కుల సమూహం తెలిపింది.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధాని షేక్ హసీనా రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.
రాబోయే లోక్హ సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు తెలంగాణ బీజేపీ సన్నద్దమయింది. తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 17 పార్లమెంట్ స్థానాలకి ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్, హరీష్ రావులు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఆయన్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు.
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదలచుకొలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా వుంటాయో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. రెపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. బిల్కిస్ పిటీషన్ కు విచారణ అర్హత ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 11 మంది నిందితులను విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.