Home / తప్పక చదవాలి
శింగనమల ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే.. ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్‌లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వైఎస్ షర్మిల మొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ నెల 18న జరగనున్న తన కుమారుడి నిశ్చితార్దానికి రేవంత్ రెడ్డిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి షర్మిలను సాదరంగా ఆహ్వనించి ముచ్చటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన మద్దతును తెలిపారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్‌తో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెలనుంచి కేసీఆర్ ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కి ప్రతిరోజూ వచ్చి కార్యకర్తలని కలుస్తారని హరీష్ రావు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని దాటింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత కక్ష్యకి చేరుకుంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యం జనసేనానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. డిసెంబర్ 14న ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కి ఓ లేఖని రాశారు. జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్ కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు
గాజాలోని ఒక హోటల్ కింద హమాస్ సొరంగాలను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్ )శనివారం తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హోటల్ కింద AK-47 రైఫిల్స్, పేలుడు పదార్థాలు మరియు డ్రోన్లతో సహా అనేక ఆయుధాలను నిల్వ చేసిందని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), శుక్రవారం నలుగురి ప్రాణాలను బలిగొన్న ప్యాసింజర్ రైలులో జరిగిన అగ్నిప్రమాదంపై యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణలో దర్యాప్తును డిమాండ్ చేసింది. పార్టీ సీనియర్ జాయింట్ సెక్రటరీ రుహుల్ కబీర్ రిజ్వీ దీనిని మానవత్వంపై క్రూరమైన దౌర్జన్యం గా అభివర్ణించారు.
అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం యొక్క ఎగ్జిట్ డోర్ ఊడిపోవడంతో పోర్ట్‌ల్యాండ్‌లో అత్యవసర ల్యాండింగ్‌కు దారితీసింది. విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నపుడు ఈ సంఘటన జరిగింది. ఈ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
అంగన్ వాడీలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్ వాడీల సమ్మెని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తలపై ఎస్మాని ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.