Home / తప్పక చదవాలి
ఇరాన్ దేశ రాయబారిని తమ దేశం నుంచి పాకిస్థాన్ బహిష్కరించింది. తమ దేశానికి చెందిన రాయబారిని కూడా ఇరాన్ వదిలి వచ్చేయాలని కోరింది. తమ భూభాగంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఇరాన్ దాడులు జరపడం చట్ట విరుద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ సుఫాన్ బురి ప్రావిన్స్ లో గల సాలా ఖావో టౌన్షిప్ సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారం లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తో ఆయన చర్చలు జరిపారు. కొణతాల త్వరలోనే మంచిరో్జు చూసుకుని జనసేన పార్టీలో చేరనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా అధికార వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు, అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందో సూచించారు. తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు.
అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ మరోసారి మొండిచేయి చూపించింది. నిన్నటి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్దిగా దయాకర్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ తాజాగా ఆయన పేరును తొలగించి మహేష్ కుమార్ గౌడ్ కు కేటాయిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దీనితో దయాకర్ కు మరోసారి ఆశాభంగం ఎదురయింది.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు తేదీని ప్రకటించిన తర్వాత రామచరిత్ మానస్ కాపీల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనితో గోరఖ్ పూర్ కు చెందిన గీతా ప్రెస్ గోస్వామి తులసీదాస్ రచించిన ఈ గ్రంధాన్ని తమ వెబ్సైట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. గీతా ప్రెస్ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ లాల్మణి త్రిపాఠి ఈ విషయాన్ని చెప్పారు.
అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామమందిరంలో విగ్రహం ప్రాణపతిష్ట వేడుకల నేపధ్యంలో అత్యున్నత స్దాయి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏఐ పవర్డ్ కెమెరాలు , డ్రోన్లు, పెద్ద ఎత్తున పోలీసుబలగాలను మోహరించి అయోధ్యలో భదత్రను పటిష్టం చేశారు.వేడుకలో ప్రతిదానిని నిశితంగా పరిశీలించడానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. సైబర్ క్రైమ్ పోలీసులకు గవర్నర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినట్లు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆమె ట్వీట్ ప్లాట్‌ఫారమ్ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని, ట్విట్టర్ సపోర్ట్ నుండి గవర్నర్‌కు కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఆమె ఖాతాలో అనుమానాస్పద కార్యాచరణ ప్రారంభమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.