Last Updated:

Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్లూమ్స్, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు.

Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం

Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్లూమ్స్, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన ప్రభుత్వ ఆర్డర్ల తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాలేదని వాపోతున్నారు. గోడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని పాలిస్టర్ ఆసాములు కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. ఇప్పటికే బతుకమ్మ చీరల ఆర్డర్లు ముగిసినప్పటికీ పవర్లూమ్ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

అధికారుల వైఖరిపై అసహనం..(Sircilla)

సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు. మరోవైపు 600 లోపు మరమగ్గాలు ఉన్న టెక్స్టైల్ పార్కు, 25 వేలకు పైగా మగ్గాలు ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడంపై సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే పరిశ్రమలు నడపలేమని స్పష్టం చేస్తున్నారు.పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంధు పడితే వేల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. పాలిస్టర్ బట్టకు కొత్త ప్రభుత్వం మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని జౌళి శాఖ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూడాలని వస్త్ర పరిశ్రమలను యజమానులు కోరుతున్నారు. పరిశ్రమపై ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి కోల్పోతున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి పవర్ లూమ్స్ యధావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభాలపై కేటీఆర్ స్పందించారు. పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని..ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్‌ను, నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై నీతి ఆయోగ్ విడుదల చేసిన గ్రాఫ్‌పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు.