Last Updated:

Upcoming Mobile Phones India February 2025: ప్రేమికుల నెల స్పెషల్.. సరికొత్త బడ్జెట్ ఫోన్లు సిద్ధం.. గిఫ్ట్‌గా ఇస్తే ఫిదా..!

Upcoming Mobile Phones India February 2025: ప్రేమికుల నెల స్పెషల్.. సరికొత్త బడ్జెట్ ఫోన్లు సిద్ధం.. గిఫ్ట్‌గా ఇస్తే ఫిదా..!

Upcoming Mobile Phones India February 2025: ప్రేమికుల నెల పిభ్రవరి ప్రారంభమైంది. ఈ నెలలో లవర్స్ ఒకరి మరొకరు సరికొత్త గ్యాడ్జెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే వివో, ఐక్యూ, సామ్‌సంగ్ వంటి బ్రాండ్లు మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లతో మార్కెట్‌ను స్ప్లాష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న అటువంటి 5 స్మార్ట్‌ఫోన్ల గురించి విరంగా తెలుసుకుందాం.

Vivo V50
లీక్‌ల ప్రకారం.. ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్, 50 MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. Snapdragon 7 Gen 3 చిప్‌ని స్మార్ట్‌ఫోన్‌లో చూడచ్చు. అలానే ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్-ఆధారంగా FuntouchOS 15 స్కిన్‌పై రన్ అవుతుంది.

iQOO Neo 10R
iQOO Neo 10R మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అలానే ఫోన్‌లో 6.78-అంగుళాల, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంటుంది.  80/100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 6,400 mAh బ్యాటరీని ఉంటుందని భావిస్తున్నారు. Vivo V50 వలె, iQOO Neo 10R కూడా Android 15-ఆధారిత FunTouchOS 15తో రావచ్చు.

Tecno Pova 7 Series
టెక్నో పోవ 7 సిరీస్‌కు చెందిన కనీసం ఒక ఫోన్ ఫిబ్రవరిలో వస్తుందని లీక్స్‌ చెబుతున్నాయి. కంపెనీ టీజర్‌ను షేర్ చేసింది. ఈ ఫోన్ Pova 7 పేరుతో రావచ్చు. ఫోన్‌లో ట్రిపుల్-కెమెరా సెటప్ చుట్టూ స్పెషల్ LED లైట్‌ ఉంటుంది. అలానే కెమెరా-సెంట్రిక్‌గా, ట్రిపుల్-కెమెరా సెటప్‌తో పాటు కొన్ని AI ఫీచర్‌లను చూడచ్చు.

Nothing Phone (3a)
నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ ఫోన్ (3a),ఫోన్ (3a) ప్లస్ అనే రెండు ఫోన్లు ఉంటాయి, ఇవి డెడికేటెడ్ టెలిఫోటో కెమెరాతో వస్తున్న బ్రాండ్ మొదటి ఫోన్‌లు. వీటి డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. గ్లిఫ్ లైటింగ్‌ కూడా ఉంటుంది. అలానే AI ఫీచర్లతో NothingOS 3తో రావచ్చు.

Realme Neo7
ఇండస్ట్రీ వర్గాల సమాచారా ప్రకారం.. రియల్‌మి త్వరలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో రానుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశం ఉంది. 16GB వరకు RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో తాజా realmeUI 6తో వస్తుందని భావిస్తున్నారు.