Last Updated:

Thailand: థాయ్‌లాండ్‌లో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 23 మంది మృతి

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్‌ సుఫాన్‌ బురి ప్రావిన్స్‌ లో గల సాలా ఖావో టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారం లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Thailand: థాయ్‌లాండ్‌లో  బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 23 మంది మృతి

Thailand:  థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్‌ సుఫాన్‌ బురి ప్రావిన్స్‌ లో గల సాలా ఖావో టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారం లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..(Thailand)

పేలుడు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం స్విట్జర్లాండ్‌లో ఉన్న ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ కార్యాలయం, పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 20 నుండి 30 మంది కార్మికులు ఉన్నారని ప్రాంతీయ పోలీసు కమాండర్ ఫోన్‌లో చెప్పినట్లు చూపించే వీడియోను పంపిణీ చేసింది.

గత ఏడాది జూలైలో, దక్షిణ థాయ్‌లాండ్‌లోని బాణసంచా గిడ్డంగిలో జరిగిన పెద్ద పేలుడులో కనీసం 10 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ప్రకారం, నారాతివాట్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ పేలుడు కారణంగా సుమారుగా 100 ఇళ్లు దెబ్బతిన్నాయి.