Last Updated:

Ys Sharmila: ‘కేసీఆర్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’

బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంటాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని షర్మిల విమర్శించారు.

Ys Sharmila: ‘కేసీఆర్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’

Ys Sharmila: బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంటాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని షర్మిల విమర్శించారు. అదే విధంగ కాళేశ్వరం ప్రాజెక్టు లో రూ. 70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్కరి తలపై రూ. లక్షన్నర అప్పు భారం మోపారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి షర్మిల నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు షర్మిల 10 ప్రశ్నలను సంధించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె రిలీజ్ చేశారు.

 

బీఆర్ఎస్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోం(Ys Sharmila)

అవినీతి సొమ్మంతా సీఎం కేసీఆర్ దగ్గరే ఉందని.. ప్రజలకిచ్చిన అన్ని హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని షర్మిల ఆరోపించింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తన పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తానని కొందరు మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడుతూ ఓ మహిళ కష్టాన్ని అవమానించొద్దని సూచించారు. అభ్యర్థులను తయారు చేసుకుని ఎన్నికల్లో పోటీకి నిలబెడతానని.. బీఆర్ ఎస్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని షర్మిల స్పష్టం చేశారు. పొత్తులపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ కూడా స్పష్టత ఇవ్వాలని తెలిపారు. అప్పట్లో తాను చేరతానంటే కాదనే పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. ఎన్నికల తర్వాత బీఆర్ ఎస్ తో పొత్తు ఉండబోదని కాంగ్రెస్‌ స్పష్టం చేయాలని షర్మిల పేర్కొన్నారు.