Last Updated:

Weather update: హైదరాబాద్ వాసులకు అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, కూకట్‌పల్లి, దుండిగల్‌, హైదర్‌నగర్‌, నిజాంపేట,

Weather update: హైదరాబాద్ వాసులకు అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

Weather update: తెలంగాణలో మరో కొన్ని గంటల్లో మోస్తారు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కంటే ఈదురు గాలులు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. గంగలకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగుల పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

 

ఉపరితల ఆవర్తనం(Weather update)

ఆగ్నేయ బంగాళాఖాతం చుట్టూ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఈ నెల 8న ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. తర్వాతి రోజు వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వివరించింది. ఈ వాయుగుండం నార్త్ గా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపుకు కదులుతూ తీవ్రమై తుపానుగా బలపడే అవకాశం ఉందని ప్రకటించింది.

 

హైదరాబాద్‌లో వర్షం..(Weather update)

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, కూకట్‌పల్లి, దుండిగల్‌, హైదర్‌నగర్‌, నిజాంపేట, మల్లంపేట్‌, గండి మైసమ్మ, సూరారం, గాగిల్లాపూర్‌, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, మదీనాగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. నాగర్‌ కర్నూలు జిల్లా లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.