Published On:

High court : ఆ భూముల్లో రేపటివరకు పనులు ఆపాలి : హైకోర్టు

High court : ఆ భూముల్లో రేపటివరకు పనులు ఆపాలి : హైకోర్టు

High court : కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్‌, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హైకోర్టులో దాఖలు చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న కోర్టు.. కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది.

 

 

 

జీవో 54 తీసుకొచ్చిన ప్రభుత్వం..
కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్‌, యూనివర్సిటీ విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వారు చేసిన దాఖలపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. హెచ్‌సీయూ తరఫున ఎల్‌.రవిశంకర్‌ వాదనలు వినిపించారు. గతేడాది జూన్‌లో ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చిందని కోర్టుకు వివరించారు. జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను నరికివేసి, భూమిని చదును చేస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలని నిపుణుల కమిటీ వేయాలన్నారు.

 

 

నిపుణుల కమిటీ పర్యటించాలి..
వన్య ప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలన్నారు. నెల రోజులపాటు అధ్యయనం చేయాలని కోర్టుకు తెలిపారు. అక్కడ మూడు లేక్‌లు ఉన్నాయని, రాక్స్ ఉన్నట్లు చెప్పారు. ఎన్నో రకాల అరుదైన జంతువులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, కొన్ని రోజులుగా భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని కోర్టుకు తెలిపారు.

ఇవి కూడా చదవండి: