Road Accident: మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన అన్నదమ్ములు మృతి
కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అన్నదమ్ములు గుజరాత్‌లోని సూరత్ వెళ్లారు. 5 రోజుల క్రితం వారి సొంత ఊరు చౌటపల్లిలో బంధువు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరు

Road Accident: మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ వాసులు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. వీళ్లు బంధువుల అంత్యక్రియలకు కోసం వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన..(Road Accident)
కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అన్నదమ్ములు గుజరాత్‌లోని సూరత్ వెళ్లారు. 5 రోజుల క్రితం వారి సొంత ఊరు చౌటపల్లిలో బంధువు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు ఈ నలుగురు తమ కుటుంబ సభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అంత్యక్రియల అనంతరం కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి మంగళవారం కారులో సూరత్ బయలు దేరారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి:
- Megastar Chiranjeevi : మళ్ళీ ఆపుకోలేక పోయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ మూవీ నుంచి చిరు లీక్స్ !
- AP Weather Report : ఏపీకి చల్లటి కబురు.. మళ్ళీ రానున్న వర్షాలు