Last Updated:

Megastar Chiranjeevi : మళ్ళీ ఆపుకోలేక పోయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ మూవీ నుంచి చిరు లీక్స్ !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. త్వరలోనే “భోళా శంకర్” గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. అయితే సాధారణంగా ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ లకు సంబంధించి, స్టోరీ గురించి

Megastar Chiranjeevi : మళ్ళీ ఆపుకోలేక పోయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ మూవీ నుంచి చిరు లీక్స్ !

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. త్వరలోనే “భోళా శంకర్” గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. అయితే సాధారణంగా ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ లకు సంబంధించి, స్టోరీ గురించి , లేదా ఫోటోలు.. వీడియో లు లీక్ అవుతూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే అది అందరి హీరోల విషయంలో జరగవచ్చు కానీ.. మెగాస్టార్ సినిమాల విషయంలో మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను చిరునే లీక్ చేస్తూ ఉంటారు.

కేవలం ఆయన సినిమాలే కాకుండా వేరే సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా చిరంజీవి లీక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల వాల్తేరు వీరయ్య సాంగ్ సూట్ అప్పుడు నేను ఆపుకోలేక అంటూ సాంగ్ ఘాట్ కి సంబంధించిన వివరాలను లీక్ చేయగా అది ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈసారి భోళా శంకర్ విషయంలో కూడా చిరు ఇదే చేశారు. లీక్స్ అంటూనే ఆల్మోస్ట్ అఫిషియల్ గా సాంగ్ ఘాట్ కి సంబంధించి పిక్స్ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో సాంగ్ ఘాట్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. చిరంజీవి చైర్ లో కూర్చొని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారాయి.

ఈ మేరకు ట్విట్టర్ లో ఫోటోలను షేర్ చేస్తూ.. “ఈ పాట ప్రేక్షకులందరికి నచ్చుతుంది. ముఖ్యంగా అభిమానులందరినీ మరింతగా మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం. అప్పటివరకూ ఈ చిరు లీక్స్ పిక్స్” అంటూ చిరు రాసుకొచ్చారు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ సాంగ్ షూట్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కోరియోగ్రఫీ అందిస్తున్నాడు. కాగా ఇప్పుడు షూట్ చేస్తున్న సాంగ్ ని.. చిరు సూపర్ హిట్ సాంగ్ ‘దాయి దాయి దామ్మా’ లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సాంగ్ పై ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

 

ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. గతంలో ఫ్లాప్ లతో ఢీలా పడ్డ మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తూ ఈసారి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.  యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.  ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో 200 కోట్లు కొల్లగొట్టిన చిరు ఈసారి అంతకు మించి సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.