Last Updated:

MLA Raja Singh: చర్లపల్లి జైలుకు రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదైంది. మంగళ్‌హాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఓపెన్ చేశారు. రాజాసింగ్‌ను రౌడీషీటర్‌గా పోలీసులు పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.

MLA Raja Singh: చర్లపల్లి జైలుకు రాజాసింగ్

Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదైంది. మంగళ్‌హాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఓపెన్ చేశారు. రాజాసింగ్‌ను రౌడీషీటర్‌గా పోలీసులు పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు.

రాజాసింగ్‌పై 2004 నుంచి 101 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. నమోదైన వాటిలో 18 మత ఘర్షణల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి: