Home / MLA Raja singh
Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తాను అస్సలు వెళ్లనని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను అని, ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యమంటే చేస్తానని చెప్పారు. గోషామహల్ ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్ వెల్లడించారు. కాగా ఇవాళ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని […]
Goshamahal MLA Raja Singh: హిందుత్వం కోసమే తన చివరి శ్వాస వరకు పనిచేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇటీవల బీజేపీకి ఆయన చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హిందుత్వ భావజాలంతో దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 11 ఏండ్ల కింద బీజేపీలో చేరినట్లు చెప్పారు. పార్టీ తనను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు […]
TBJP: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఇవాళ ఓ లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజాసింగ్.. ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను సమర్పించారు. రాజాసింగ్ ఇచ్చిన లేఖను కిషన్ రెడ్డి పార్టీ హైకమాండ్ కు పంపారు. దీంతో ఆయన రాజీనామాను పార్టీ పెద్దలు ఆమోదించారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ సీరియస్ […]
BJP serious about MLA Raja Singh Resignation: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని, పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని పేర్కొంది. రాజాసింగ్ […]
Goshamahal MLA Raja Singh resigns from BJP: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనీయలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ ఈ రోజు ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి […]
MLA Raja Singh : చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌ను కలచివేసింది. మృతుల కుటుంబానికి ఊహించలేని దుఃఖాన్ని మిగిల్చింది. బాధితులకు మద్దతు అందించాల్సిన సమయంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి వారిపట్ల […]
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన ఆయన్ను ముందస్తు చర్యల్లో భాగంగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ధర్మాసనం మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దనింది.
మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఏడాది ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.