Home / తెలంగాణ
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ స్థిరంగా ఉన్నట్టు వాతారణ శాఖ స్పష్టం చేసింది.
మార్గదర్శి చిట్స్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడి అధికారులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ రామోజీరావు నివాసానికి చేరుకున్న ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌ని ప్రశ్నిస్తున్నారు
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Wather Update: ఇప్పుడొస్తాయ్ అప్పుడొస్తాయని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు అదిగో ఇదిగో అంటూ ఇంకా ఆలస్యం అవుతున్నాయి. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి పెరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సింధు ఫౌండేషన్ కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసారథి రెడ్డి వ్యవహరిస్తున్నారు.
9th Nizam Nawab: నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 57వ వర్ధంతి సందర్బంగా నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నిర్మల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. కొత్త కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలపై విమర్శలు కురిపిస్తూనే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ వివరించారు.
తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మరో వారంరోజులపాటు ధాన్యం కొనుగోళ్లను కొనసాగించాలని భావిస్తోంది. జూన్ 10 నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేసి ఈ సీజన్ ను ముగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జనవరి 18న ఖమ్మంలో ప్రారంభించిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.6 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు.
Katakam Sudarshan: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో ఆయన మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ ప్రకటించింది. కటకం సుదర్శన్ అలియాస్ కామ్రేడ్ ఆనంద్ 69 సంవత్సరాల క్రితం ఒక కూలీ కుటుంబంలో జన్మించాడు