Road Accident : వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న
Road Accident : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం మత్తులో లారీని రాంగ్‌రూట్‌లో నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కాగా ఈ ఘటనలో ఆటోలోని డ్రైవర్ తో సహా నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆటోలోనే మరో ముగ్గురు ఇరుక్కుపోగా.. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స తీసుకుంటూ మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. బాధితులంతా తేనె విక్రయించే కూలీలుగా తెలుస్తోంది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.