Former Minister Chandrasekhar: బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. 2021 జనవరి 18న బీజేపీలో చేరిన చంద్రశేఖర్.. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ పంపారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారడంతో తప్పనిసరై రాజీనామా చేస్తున్నానని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు
Former Minister Chandrasekhar: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. 2021 జనవరి 18న బీజేపీలో చేరిన చంద్రశేఖర్.. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ పంపారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారడంతో తప్పనిసరై రాజీనామా చేస్తున్నానని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. 18 న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
బీజేపీ వైఫల్యం..(Former Minister Chandrasekhar)
ఇలా ఉండగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ని ఎదుర్కోవడంలో బీజేపీ వైఫల్యం చెందిందని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవినుంచి తప్పించడం తనను బాధించిందన్నారు. తనలాగే మరికొంతమంది నేతలు బీజేపీని వీడే అవకాశముందన్నారు. టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారన్నారు. చేవెళ్ల , జహీరాబాద్ నియోజక వర్గాలనుంచి పోటీ చేయాలని తనను కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తనకు ఎటువంటి విబేధాలు లేవని చంద్రశేఖర్ స్పష్టం చేసారు.