Home / తెలంగాణ
తెలంగాణలోని గోషామహల్ ఎమ్మేల్యే రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తి వేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోనుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయనున్నట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం రెగ్యులర్ గా జరిగే పని అయినప్పటకి పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.
రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకి విజయవాడ ఏసీబీ కోర్టు షాకిచ్చింది. నవంబర్ ఒకటో తేదీ వరకూ చంద్రబాబు రిమాండుని ఎసిబి కోర్టు పొడిగించింది. నేటితో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఎసిబి కోర్టులో హాజరయ్యారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్, కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.పార్టీ విజయ భేరి యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా కాటారం ర్యాలీలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని ఆయన కొనియాడారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల కాలంలోగిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్దం జరుగుతుంది. తెలంగాణలో రైతు కుటుంబాలకు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధిచేకూర్చేందుకు ఎం.ఐ.ఎం అభ్యర్థిని గోషామహల్ నుంచి నిలబెట్టడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.