Home / తెలంగాణ
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడి చేశారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. తర్వాత కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ, పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు.
గత కాంగ్రెస్ హయాంలో అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ రంగాన్ని 2014 తర్వాత పునరుద్ధరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మోటార్లు కాలిపోయాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఎన్నో వార్తలు వచ్చాయన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ప్రజలు ఇచ్చిన తీర్పును నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. అందెశ్రీ కవితతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
యూట్యూబ్ చందు గాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనితో సాయి కిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలని ప్రశ్నించని ఆ పార్టీ నేతలు నెమ్మదిగా గళం విప్పడం ప్రారంభించారు. అధినేత నిర్ణయాలని తప్పుబట్టడం మొదలు పెట్టారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అంగీకరించారు.
అదిలాబాద్ రిమ్స్ కళాశాలలో వైద్య విద్యార్థులు రెండో రోజు బైఠాయించి వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అత్యవసర సేవలు తప్ప మిగతా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. రిమ్స్ డైరక్టర్ జైసింగ్ రాథోడ్‌ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
యశోదా ఆస్పత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ కు వైద్యలు తుంటి ఎముక మార్పిడి చేశారు. అయితే ఆయనకు ఆరు నుంచి 8 వారాల రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. విశ్రాంతి సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు.ప్రొటెం స్పీకర్ ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు ఆయననుస్పీకర్ స్దానం వద్దకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.
అదిలాబాద్ రిమ్స్‌లో రాత్రి వైద్య విద్యార్థులను బయటి వ్యక్తులు వచ్చి కొట్టడాన్ని నిరసిస్తూ రిమ్స్ విద్యార్థులు ప్రధాన గేట్ ముందర ధర్నాకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ దిష్టి బొమ్మను విద్యార్థులు దహనం చేశారు. తమ వార్డుల్లో సరైన సదుపాయాలు లేవని నిన్న సాయంత్రం డైరెక్టర్‌తో గట్టిగా మాట్లాడితే ఇలా రౌడీలను తీసుకువచ్చి దాడులు చేపియిస్తారా అని బాధితుడు కవిరాజు నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబసమేతంగా గురువారం తెల్లవారు జామున గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాలతో ఆర్థిక, ఇంధన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.