CM Revanth Reddy: మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పదిలక్షలకు పెంపు, మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పథకాలని ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్‌ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పదిలక్షలకు పెంపు, మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పథకాలని ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్‌ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు..(CM Revanth Reddy)
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకోసం వినియోగించే జీరో చార్జి టికెట్‌ను కూడా సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కి ప్రోత్సాహకంగా రెండు కోట్ల రూపాయల చెక్‌ని సిఎం రేవంత్ అందజేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారు. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని ప్రజలకోసం ఆరు గ్యారంటీలను ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. త్వరలోనే మిగిలిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. మహిళలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని తెలిపారు.