Last Updated:

Crime News : ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్‌లో మరో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. చిన్న పిల్లలు, వృద్ధులను తీసుకువచ్చి నగరంలో బెగ్గింగ్ చేయిస్తోన్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగానే.. తాజాగా మరో ముఠాను పోలీసులు ఛేదించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తోన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Crime News : ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టు..

Crime News : హైదరాబాద్‌లో మరో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. చిన్న పిల్లలు, వృద్ధులను తీసుకువచ్చి నగరంలో బెగ్గింగ్ చేయిస్తోన్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగానే.. తాజాగా మరో ముఠాను పోలీసులు ఛేదించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తోన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీబస్టాండ్‌తో ఇతర ప్రధాన జంక్షన్ల దగ్గర ట్రాన్స్ జెండర్ వేషంలో బిక్షాటన చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని 15 మంది నకిలీ ట్రాన్స్ జెండర్లు.. ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ ముఠా