MLA Banoth Madanlal Died: వైరా మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. పలువురి సంతాపం
Wyra Ex. MLA Banoth Madanlal Passed Away: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాణోత్ మదన్ లాల్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. నాలుగురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఖమ్మంలోని ఆయన ఇంట్లో వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో చనిపోయినట్టు బంధువులు చెప్పారు. మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. కాగా 2014లో వైసీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరి 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు చూస్తున్నారు.