Last Updated:

BJP Chief Bandi Sanjay: బండి సంజయ్ 24 గంటల పాటు హౌస్ అరెస్ట్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ గారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ 27న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యాత్రలో ఒక్కసారిగా హై టెన్షన్‌ వాతావరణం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నిరసనలో బీజేపీ నేతలపై దాడి జరిగిందని, ఆ కారణంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్ పడింది.

BJP Chief Bandi Sanjay: బండి సంజయ్ 24 గంటల పాటు హౌస్ అరెస్ట్

Hyderabad: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ గారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ 27న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యాత్రలో ఒక్కసారిగా హై టెన్షన్‌ వాతావరణం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నిరసనలో బీజేపీ నేతలపై దాడి జరిగిందని, ఆ కారణంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్ పడింది. బండి సంజయ్‌ను జనగామలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్‌లోని తన నివాసం వద్ద వదిలిపెట్టారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. తదుపరి బండి సంజయ్ ను యాత్రకు రావొద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై న్యాయపోరాటానికి కూడా బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. దానికి నిరసనగా దీక్ష చేయబోయారు బండి సంజయ్‌. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షకు అనుమతి లేదనే కారణంతో పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనగామ సమీపంలోని పామునూరు – ఉప్పుగల్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుంది దాదాపు అరగంటసేపు హైటెన్షన్‌ నెలకొంది.

సంజయ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. అక్కడ కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాదయాత్రకు, దీక్షకు అనుమతి లేదని, కాబట్టి జనగామ రావొద్దని బండిసంజయ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వరంగల్‌ పోలీసులు ఆయన 24 గంటలు హౌస్‌ అరెస్ట్‌లో ఉంచుతున్నట్లు మీడియా ముందు స్పష్టం చేశారు. దీనిపై తీవ్రంగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా యాత్రను ఆపేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని బీజేపి నేతలు హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. వెంటనే విచారణ జరపాలని కోరారు. అయితే రెగ్యులర్‌గా పిటిషన్‌ వేయాలని సూచించింది హైకోర్టు.బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం పై తీవ్రంగా బండి సంజయ్ మండిపడ్డారు. ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తానని బండి సంజయ్ ప్రకటించారు. యాత్రను అడ్డుకుని సీఎం కేసీఆర్‌ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. 27న వరంగల్‌లో బహిరంగ సభ భారీ ఎత్తున బండి సంజయ్ జరిపి తీరతామని ప్రకటించారు. మరో వైపు తెలంగాణలో త్వరలో లిక్కర్‌ స్కామ్లు అన్ని బయట పడతాయని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలు ఎక్కడ బయట పడతాయా అని, టీఆర్‌ఎస్‌ నేతలు అల్లర్లు చేస్తున్నారని ఆరోపించారు. అరచేతితో సూర్యుణ్ని ఆపుతామనుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమే అని , బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ అవుతుందన్నారు. మునుగోడులో ఎక్కడ ఓడిపోతారా అనే భయంతోనే, కేసీఆర్‌ ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్‌కు బీజేపీ నేతలు వినతిపత్రం పంపించారు.

ఇవి కూడా చదవండి: