Last Updated:

Bharat Jodo Yatra: నేడు హైదరాబాద్ లో భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర భాగ్యనగరంలోకి ప్రవేశించింది. శంషాబాద్‌ నుండి రాజేంద్రనగర్‌, బహదూర్‌ పుర, చార్మినార్‌, గోషామహల్‌, నాంపల్లి, కూకట్‌ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది.

Bharat Jodo Yatra: నేడు హైదరాబాద్ లో భారత్‌ జోడో యాత్ర

Hyderabad: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర భాగ్యనగరంలోకి ప్రవేశించింది. శంషాబాద్‌ నుండి రాజేంద్రనగర్‌, బహదూర్‌ పుర, చార్మినార్‌, గోషామహల్‌, నాంపల్లి, కూకట్‌ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది. మొదటి రోజు ఆరాంఘర్‌ నుంచి బహదూర్‌ పూర, చార్మినార్‌, అఫ్జల్‌ గంజ్‌, మొజాంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌ మీదుగా సాయాంత్రం నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటుంది.

విగ్రహానికి పూలమాళలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కాగ్రెస్‌ శ్రేణులతో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 3న ఉదయం ప్రారంభమయ్యే పాదయాత్ర బోయిన్‌పల్లి, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌ పల్లి, మియాపూర్‌ వరకు సాగనుంది. జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర కాంగ్రెస్‌ పార్టీ యాత్ర సాగే దారి పొడుగునా ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్‌ నేతలు పోటాపోటీగా జెండాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అన్ని స్థాయిల వారు పాల్గొంటున్న ఈ యాత్రను భారీ ఎత్తున సక్సెస్‌ చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

హైద‌రాబాద్ ప‌రిధిలో 8 కిలోమీట‌ర్ల పొడ‌వునా రాహుల్ పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. ఈ కార్యక్రమంలో ప‌లు చోట్ల ట్రాఫిక్ డైవ‌ర్షన్, ఆంక్షలు ఉంటాయ‌ని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగ‌నాథ్ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. పురానాపూల్‌, ముస‌బౌలి, లాడ్ బ‌జార్, చార్మినార్ మీదుగా రాహుల్ పాదయాత్ర కొన‌సాగ‌నుంది. దీంతో సౌత్ జోన్‌లో మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్షలు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.

చార్మినార్ నుంచి అఫ్జ‌ల్ గంజ్, మోజాం జాహీ మార్కెట్, గాంధీ భ‌వ‌న్‌, పోలీసు కంట్రోల్ రూమ్, ర‌వీంద్ర భార‌తి, ఆర్బీఐ, తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మీదుగా పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. రాత్రి 8:30 గంట‌ల స‌మ‌యంలో ఇందిరాగాంధీ విగ్రహం వ‌ద్ద రాహుల్ గాంధీ ప‌బ్లిక్ మీటింగ్‌లో పాల్గొన‌నున్నారు. పాదయాత్ర జరిగే మూడు కిలో మీటర్ల పరిధిలో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని వాహ‌న‌దారుల‌కు సూచించారు. ఆర్టీసీ బస్సులను సైతం డైవర్ట్ చేస్తున్నామని, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: