Last Updated:

Telangana theatres: తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు నిలిపివేత

తెలంగాణలోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.గత కొంతకాలంగా ధియేటర్ల కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో వారికి ఆర్దిక ఇబ్బందులు తలెత్తడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. పరిస్దితుల్లో మార్పు వస్తే మరలా షోలు కొనసాగిస్తామని చెబుతున్నారు.

Telangana theatres: తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు నిలిపివేత

Telangana theatres: తెలంగాణలోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.గత కొంతకాలంగా ధియేటర్ల కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో వారికి ఆర్దిక ఇబ్బందులు తలెత్తడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. పరిస్దితుల్లో మార్పు వస్తే మరలా షోలు కొనసాగిస్తామని చెబుతున్నారు.

ప్రేక్షకులు తగ్గడంతో ..(Telangana theatres)

గత కొంత కాలంగా థియేటర్‌ లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు .స్టార్ హీరోల సినిమాలను మాత్రమే థియేటర్ కు వెళ్లి చూస్తున్నారు .అదీ కూడా ఒక వారమే నడుస్తున్నాయి .తర్వాత థియేటర్‌ లు ఖాళీగానే ఉంటున్నాయి .ఓటిటీ రావడం ,ఇళ్లల్లో సొంత స్క్రీన్ లు ఏర్పాటు చేసుకోవడంతో ప్రేక్షకులు థియేటర్ కు రావడంలేదు .తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో థియేటర్ లు ఇప్పటికే శాశ్వతంగా మూసివేశారు .ఓటిటీ వచ్చిన తర్వాత థియేటర్ లు ఎక్కువగా మూసివేస్తున్నారు .భవిష్యత్తు లో థియేటర్ లకు వెళ్లి సినిమా చూసే వాళ్ళు ఇంకా తగ్గే అవకాశాలు వున్నాయి .