Road Accidents in AP :ఏపీలో రోడ్డు ప్రమాదాలు
ఏపీలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి .తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయినది .ఉమ్మడి చిత్తూర్ జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి రేణిగుంట మండలం వెద్దలచెరువు వద్ద ఉదయం సంఘటన చోటు చేసుకుంది బెంగుళూరు నుండి అమలాపురం వెళుతున్న బస్సుకు వెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద ప్రమాదం జరిగినది. బస్సు టైర్ పగిలి నిప్పులు రావడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది
Road Accidents in AP; ఏపీలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి .తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయినది .ఉమ్మడి చిత్తూర్ జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి రేణిగుంట మండలం వెద్దలచెరువు వద్ద ఉదయం సంఘటన చోటు చేసుకుంది బెంగుళూరు నుండి అమలాపురం వెళుతున్న బస్సుకు వెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద ప్రమాదం జరిగినది. బస్సు టైర్ పగిలి నిప్పులు రావడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది .బస్సు వెనుక వైపు నుంచి వస్తున్న ఓక్ కార్ డ్రైవరు దీనిని గమనించి బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో బస్సులోని ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులను బస్సు డ్రైవర్ సురక్షితంగా బస్సు నుండి దింపివేసారు .దింతో ఘోర ప్రమాదం తప్పినట్లయింది . ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు .అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు .
పెట్రోల్ టాంకర్ బోల్తా(Petrol tanker overturned)
ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో తప్పిన పెను ప్రమాదం.ఒక్కసారిగా ఉలిక్కిపడిన మీర్జాపురం గ్రామ ప్రజలు. జరిగిన రోడ్డు ప్రమాదంలో పెట్రోల్ టాంకర్ బోల్తా పడిన ఘటనలో ట్యాంకర్ నుండి బయటికి వచ్చిన పెట్రోల్ డ్రైన్ లోకి వెళ్ళిన వైనం.ప్రమాదవశాత్తు డ్రైన్ లో ఉన్న పెట్రోల్ కు నిప్పు అంటుకోవడంతో పెట్రోల్ బంక్ సమీపంలో కారుచిచ్చులా ఎగసపడిన మంటలు. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందికి గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు, సిబ్బందిమంటలు చెలరేగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విద్యుత్ శాఖ సిబ్బంది.నూజివీడు డిఎస్పి లక్ష్మయ్య పర్యవేక్షణలో మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సిబ్బంది. టాంకర్ బోల్తా పడిన ఘటనలో పెట్రోల్ డ్రైనేజ్ ద్వారా ఊరు బయటకు వెళ్ళింది.గుర్తుతెలియని యువకుడు నిప్పు పెట్టడంతో డ్రైన్ లో పారదల అయిన పెట్రోల్ కు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు .గ్రామస్తుల సహకారంతో అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగిందన్నారు డి.ఎస్.పి లక్ష్మయ్య అన్నారు . గ్రామం వెలుపల ఉన్న పెట్రోల్ బంకు పరిసర ప్రాంతాల్లో మరో సారి ఉదృతంగా మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపులోకి తీసుకువచ్చామని డిఎస్పి లక్ష్మయ్య తెలిపారు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం(Road accident on national highway)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది . కనిగిరి నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు పంచరై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది ..ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు .గాయపడిన వారిని నెల్లూరు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు . ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం .ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .