Home / ప్రాంతీయం
AP cabinet Meeting important Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అకడమిక్ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Formula-E race case Update: ఫార్ములా-ఈ కార్ కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా, గురువారం ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు సమయం కోరుతూ ఈడీకి లేఖ రాశారు. అదే విధంగా ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు సైతం బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. ఇదిలా ఉండగా, తర్వాత విచారణ ఎప్పుడు అనేది చెబుతామంటూ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సమాధానం ఇచ్చింది. ఫార్ములా-ఈ కార్ […]
CMR Engineering College Girls Hostels issue: మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లేడీస్ హాస్టల్లోకి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు వెళ్లారు. అయితే హాస్టల్లో ఎన్ఎస్యూఐ నేతలు వెళ్లడంతో సీఎంఆర్ యాజమన్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విద్యార్థి సంఘం నేతలకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి కాలేజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం పేరెంట్స్, స్టూడెంట్స్‌తో ఏసీపీ మాట్లాడారు. కాగా, సీఎంఆర్ కాలేజ్ విద్యార్థినులు ఆందోళన […]
Water Leak At Srisailam Hydropower Station: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ కలకలం రేగుతోంది. గత కొంతకాలంగా చిన్న చిన్న డ్రాప్ మోతాదులో లీకేజీ జరుగుతుండగా.. తాజాగా, ఆ లీకేజీలు మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ లీకేజీలపై అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. వివరాల ప్రకారం.. గత వారం రోజులుగా శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ జరుగుతోంది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. […]
Rythu Bharosa Funds To Be Released before Sankranti: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసాపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రైతు భరోసాపై గురువారం క్యాబినెట్ సబ్ కమిటీ […]
AP Deputy CM Pawan Kalyan Released development of Pitapuram Work Reports: జనసేన అధినేత కొత్త ఏడాదిలో వినూత్న ప్రయత్నంతో ముందుకొచ్చారు. ఆరునెలల క్రితం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తాను.. అర్థ సంవత్సరంలో సొంత నియోజక వర్గానికి ఏం చేశాననే అంశాలను ‘సమగ్ర అభివృద్ధి నివేదిక-2024’పేరిట ట్వీట్టర్లో వెల్లడించారు. ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో తాను ఉండడం సంతోషంగా […]
Congress High Command changes Incharge of Telangana affairs: కొత్త సంవత్సరం వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏఐసీసీలో ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేయనుంది. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులలో మార్పులు చేయడంతోపాటు రాష్ట్రాల ఇన్ఛార్జ్లను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ను మార్చే దిశగా అధిష్ఠానం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇటీవల బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ […]
New Year wishes for a prosperous 2025: నూతన సంవత్సరం సందర్బంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అందరూ ట్వీట్ చేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి వచ్చిన సందర్బంగా దేశ ప్రజలను ఉద్ధేశిస్తూ ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. 2024లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఈ మేరకు వీడియో […]
CM Chandrababu meeting in palnadu: పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో యల్లమందలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ సారమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. సారమ్మ కూతురికి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. అలాగే సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించాలని చెప్పారు. అలాగే ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు స్వయంగా ఆ కుటుంబానికి స్వయంగా కాఫీ తయారు చేసి ఇచ్చారు. […]
New Year Offer in Hyderabad Free Transport services on December 31st: మద్యంబాబులకు అదిరిపోయే శుభవార్త. కొత్త సంవత్సరం పురస్కరించుకొని డిసెంబర్ 31న ఉచిత ప్రయాణంపై తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. ఇందు కోసం ప్రత్యేకంగా మూడు కమిషనరేట్ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే, […]