Home / ప్రాంతీయం
Road Accident in Palnadu dist: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి తిరిగి వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో మహిళలు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందులో ట్రాక్టర్ కిందపడిన నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ట్రాక్టర్లో దాదాపు 20 మందికి పైగా కూలీలు […]
Woman dies of Guillain-Barre Syndrome in Telangana: మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నది. వ్యాధిబారిన పడిన 25 ఏండ్ల మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన వివాహిత జీబీఎస్ అనే నరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఆమెకు వ్యాధి నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమించడంతో ఆదివారం […]
BJP leaders celebrate Delhi victory at State office In Hyderabad: ఢిల్లీలో బీజేపీ గెలిచిన విధంగా తెలంగాణలోనూ బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ గెలుపొందడంపై హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ మాదిరిగా తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి ఏంటో ఢిల్లీలో […]
AP CM Chandrababu First Reaction On Delhi Election Results: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలో వైసీపీ సంక్షేమం పేరుతో రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే నాడు వైసీపీని, నేడు ఆమ్ఆద్మీ పార్టీలను ప్రజలు దారుణంగా తిరస్కరించారని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద ఆయన మీడియాతో మాట్లాడారు. సంపద లేకుండా.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని చంద్రబాబు అన్నారు. […]
State Election Commission key decision to Local Body Elections: తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలను వీలయినంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే మంతనాలు జరిపిన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనతో […]
AP Deputy CM Pawan Kalyan Interesting Comments on BJP Victory In Delhi: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరవేసింది. అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై […]
Telangana Congress resolution on caste census in assembly: కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో బీసీ నినాదంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్కు కౌంటర్ ఎలా ఇవ్వాలి..? బీసీ వర్గాలకు ఎలా దగ్గర కావాలనే దానిపై బీఆర్ఎస్ బీసీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార-విపక్షాల మధ్య బీసీ పోరు మొదలైంది. బీసీలకు మేం అది చేశాం…ఇది చేశామని […]
Janasena Party Recognition Also regional Party in telangana: జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో ఇకపై.. జనసేన టికెట్ పొందిన […]
Vijayasai Reddy Counter To YS Jagan:: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డితో కలిసి ఇప్పటివరకు నలుగురు పార్టీని వీడారన్నారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని చెప్పాడు. మనమే ప్రలోభాలకు ఆశపడి లేదా భయాందోళన చెంది […]
Big Shock For Chicken Lovers: మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు… కోడి కూర ఉండాల్సిందే. అయితే, ఈ వార్త చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం పౌల్ట్రీ పరిశ్రమను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ […]