Home / ప్రాంతీయం
TDP Mahanadu in Kadapa: రేపటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి కడప నగరం ముస్తాబైంది. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహానాడు సభా ప్రాంగణానికి కన్వీనర్ గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పార చేతపట్టి […]
Vallabhaneni Vamsi Falls Sick: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంశీ అస్వస్థతకు గురవడంతో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. […]
4 Killed in Accident Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరొకరికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. కాగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని […]
Heavy Rush in Saraswati Puskaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. గత 12 రోజులుగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగమ్మకు దీపాలు వదులుతున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. మరోవైపు సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ రాత్రి 7.45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు సమాప్తం కానున్నాయి. […]
Pawan Kalyan Chennai Tour: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటిస్తున్నారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అంశంపై జరగే సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్- వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలో సెమినార్ నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న […]
CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా తిరుగుతున్నారు. కాగా శనివారం నిర్వహించిన నీతి ఆయోగ్ మీటింగ్ కోసం గత శుక్రవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఇంకా హస్తినలోనే మకాం వేశారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, పలు పథకాలకు ఆర్థికసాయంపై చర్చించారు. తర్వాత కాంగ్రెస్ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. […]
AP Ex Minister Kakani Arrested in Illegal Mining Case: ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పెలుడు పదార్థాల వినియోగం వంటి అంశాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణిని ఏ-4 గా చేర్చుతూ.. కేరళలో ఆయనను […]
Heavy Rains Expected to Andhra Pradesh for Next 3 Days: ఏపీకి వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా అల్పపీడన […]
Rain Alert to Telangana: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు నేడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, వరంగల్, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం […]
Telangana ECET 2025 Results Out Now Check Here: తెలంగాణ ఈసెట్- 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్, బీస్సీ మ్యాథ్స్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12న ఈసెట్ ఎంట్రెన్స్ నిర్వహించారు. మొత్తం 18,928 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 96.22 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో ఓయూ వీసీ కుమార్, […]