Home / ప్రాంతీయం
3 Killed in Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని ముత్యాలమ్మగా గుర్తించారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది, మృతుల వివరాలు […]
South Central Railway: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు నడుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో విహారయాత్రలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో రైళ్లలో రద్దీ నెలకొంది. రెగ్యులర్ గా తిరిగే రైళ్లు ప్రయాణికుల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో స్పెషల్ ట్రైన్స్ నడిపించాలని ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున్న డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ […]
10% Discount on Hyderabad Metro Tickets form Today: మెట్రో ప్రయాణికులు గుడ్ న్యూస్. కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలులో ఛార్జీలను కనీసం రూ.10 నుంచి రూ.12కు పెంచగా.. అత్యధికంగా రూ.60 నుంచి రూ.75 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెంచిన ఛార్జీలపై మరోసారి పరిశీలించి 10 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఛార్జీలు మే 24 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. […]
MLC Kavitha Response on Letter Which is Sent to KCR: మా నాయకుడు కేసీఆరేనని, ఆయన నాయకత్వలోనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో జరిగిన సభ తర్వాత రెండు వారాల క్రితం తన తండ్రి, […]
Chandrababu on Rajadhani: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో భారీగా విధ్వంసం జరిగిందని ఆరోపించారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. […]
Niloufer Hospital Superintendent Ravikumar Suspend: నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి కుమార్‌పై వేటు పడింది. సూపరింటెండెంట్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రవికుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంచార్జ్‌గా డాక్టర్ విజయ్ కుమార్‌ను నియమించింది. నిలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణం కూల్చివేశారు. ఈ దుకాణాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంవో, మంత్రి పేర్లను సూపరింటెండెంట్ ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తానెలాంటి అనుమతి […]
GHMC Assistant Town Planner by ACB Raids: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావుపై వెంకట్ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన వెంకట్ రావు భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సి సర్టిఫికెట్ నిమిత్తం జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు వెంకట్ రావు వద్ద నుంచి రూ.8 లక్షల రూపాయల లంచం […]
Uttam Kumar Reddy fires on BRS: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు ఉన్నట్లు తేల్చడానికి దేశంలోనే పేరుగాంచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకుంటే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. నోటీసు ఇవ్వగానే కమిషన్ తప్పుబడుతూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇందిరా గాంధీ లాంటి […]
Supreme Court Serious on Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జస్టిస్ పంకజ్ మిత్తల్, ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందన్న సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో […]
BJP MLA Raghunandan Rao Sensational Comments on MLC Kavita: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా?.. ఆస్తుల పంచాయితీనా? అని ప్రశ్నించారు. కవిత చెప్పినా.. చెప్పకున్నా.. తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రఘునందన్ రావు. కవితను బయటకు పంపించడం కోసం.. బావ, బావమరిది ఒక్కటి అయ్యారు అనే సంకేతం మీటింగ్ ద్వారా ఇచ్చారన్నారు. కవిత ..మరో షర్మిల […]