Home / ప్రాంతీయం
ఇటీవల కాలంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో ఏపీలో రాజకీయ రగడ మొదలయ్యింది. ఈ విషయంపై అటు తెదేపా నేతలు సహా నందమూరి కుటుంబం మరియు అభిమానులు జగన్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా తాజాగా వర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా ట్విట్టర్ ద్వారా స్పందించారు. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు కవల పిల్లలు మరణించారు.
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.
అగ్నిప్రమాదం ఆ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుని వైద్యునితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగ సంబరాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
కుకట్ పల్లి లోని వివేకానంద నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోటు పుస్తకాలను భాజపా నేత రవికుమార్ యాదవ్ ఉచితంగా పంపిణీ చేసారు.
గుడివాడ మీదుగా సాగుతున్న అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో ఆధ్యంతం పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హైకోర్టు నిబంధనల మేరకు చేపడుతున్న పాదయాత్రలో రైతులతో పాటు పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వచ్చిన వారిని సైతం గుడివాడ పోలీసులు అడ్డుకొన్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్టీఆర్ పేరు మార్పుతో నందమూరి కుటుంబాన్ని రోడ్డుకు లాగాలన్నదే వైకాపా ప్రభుత్వ లక్ష్యంగా మంత్రులు కార్యచరణ గుప్పిస్తున్నారు.
ఓ వైపు మైనర్లకు పబ్బుల్లో ప్రవేశాలు, మరో వైపు నిత్యం ఎక్కడో ఓ చోట జరిగే అసాంఘిక వ్యవహారాలకు హైదరాబాదు పబ్ లు కేరాఫ్ గా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులకు ప్రభుత్వ పెద్దలు అడ్డు తగులుతూ ఉంటారు. దీంతో పర్యవేక్షణ పోలీసులకు సాధ్యం కాని పనిగా మారింది.