Last Updated:

Accident: నటి కారు ఢీకోని మెట్రో కార్మికుడు మృతి – కేసు నమోదు

Accident: నటి కారు ఢీకోని మెట్రో కార్మికుడు మృతి – కేసు నమోదు

Actress Urmila Kothare Car Accident: బాలీవుడ్‌ నటి ఉర్మిళా కొఠారే కారు డైవర్‌ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆమె కారు యాక్సిడెంట్‌ వల్ల ఓ కార్మికుడు మృతి చెందగా మారోకరికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ముంబైలో కాండీవిల్లిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నటి ఉర్మిళా కొఠారే షూటింగ్ పూర్తి చేసుకుని శుక్రవారం రాత్రి సెట్స్‌ నుంచి తిరిగి వెళుతుంది. ఈ క్రమంలో ఆమె డ్రైవర్‌ కారుపై నియంత్రణ కోల్పోవడంతో అక్కడ మెట్రో ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తున్న ఇద్దరు కార్మికులపైకి కారు దూసుకుపోయింది.

ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మరణించగా. మరోకరు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నటి డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నటి ఉర్మిళా ఆమె డరైవర్‌ కూడా గాయడ్డారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం సయంలో కారు ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో నటి ఆమె డ్రైవర్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ర్యాష్ డ్రైవింగ్‌, నిర్లక్ష్యం వంటి పలు సెక్షన్ల కింది డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.