Sooseki Song: ‘పుష్ప 2’ నుంచి మరో సాంగ్ వచ్చేసింది – సూసేకి ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
Pushpa 2 Sooseki full Video Song Out: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. రికార్డు మీద రికార్డు కొల్లగొడుతూ సరికొత్త రికార్డ్స్ నెలకొల్పతుంది. ఇప్పటి మూవీ రిలీజైన మూడు వారాలు అవుతున్న ఇప్పటికీ థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పటి ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కలెక్షన్స్ పరంగానూ పుష్ప 2 దుమ్మురేపుతుంది.
ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 1730 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇప్పటికే కేజీయఫ్ 2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ చిత్రం బాహుబలి 2, దంగల్ చిత్రాల రికార్డ్స్ వైపు దసూకుపోతుంది. నిన్నటి నుంచి కలెక్షన్స్‌లో కాస్తా డ్రాప్ కనిపించిన థియేటర్‌లో మాత్రం అదే జోరు చూపిస్తుంది. ఇక సంక్రాంతి వరకు బాక్సాఫీసు వద్ద పుష్ప 2 దే హవా అని చెప్పాలి. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటనతొ పుష్ప 2 టీంకి చేదు అనుభవం ఎదురైంది.
మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినా.. అల్లు అర్జున్ అరెస్ట్‌తో ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో మూవీ టీం నిరాశలో ఉంది. అయినా అభిమానులను, ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంతో ఏమాత్రం వెనకడటం లేదు. ఓ వైపు అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు పుష్ప 2 టీం మాత్రం ఈ సినిమాలో వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల ఉత్సమాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
ఇప్పటికే పీలింగ్, కిస్సిక్, దమ్ముంటే ఆపరా షేకవత్ వంటి ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేశారు. తాజాగా పుష్ప 2లోని కపుల్ సాంగ్ విడుదల చేశారు. సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడు నా సామీ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసి ప్రేక్షకులు మంచి ట్రీట్ ఇచ్చారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ సాంగ్‌కు లిరికల్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా యూట్యూబ్‌లో 500 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట ఇంకేన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.