Fire Accident In Renigunta: రేణిగుంటలో ఘోర అగ్నిప్రమాదం.. వైద్యుడు సహా ఇద్దరు చిన్నారులు మృతి
అగ్నిప్రమాదం ఆ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుని వైద్యునితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది.
Fire Accident In Renigunta: అగ్నిప్రమాదం ఆ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుని వైద్యునితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రేణిగుంట పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. భగత్‌సింగ్ కాలనీలో కార్తికేయ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఆసుపత్రిలోనే పై అంతస్తులోనే డాక్టర్ రవిశంకర్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. కాగా ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసముంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన స్థానికులు వెంటనే తిరుపతి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు వైద్యుడి భార్య మరియు అత్తను మంటల్లోనుంచి బయటకు తీసుకురాగలిగారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే పై అంతస్తును మంటలు చుట్టుముట్టాయి. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకుని వైద్యుడు రవిశంకర్ అక్కడిక్కడే సజీవదహనం అయ్యాడు. కాగా అగ్నిమాపక సిబ్బంది అతికష్టం వైద్యుడి కుమారుడు భరత్ (12) కుమార్తె కార్తీక (15)లను పైఅంతస్తు నుంచి కిందికి తీసుకురాగలిగారు కానీ వారు తీవ్రగాయాలపాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Viral News: ఏడాదిన్నరగా ఇంట్లోనే డెడ్ బాడీ.. తీరా చూస్తే ఘోరం..!